ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్య కట్టడికి గ్రాప్-4 అమలు..! 1 m ago
ఢిల్లీ పరిధిలో వాయు కాలుష్య కట్టడికి గ్రాప్-4 దశ కింద నిబంధనలు అములు చేస్తునారు. ఢిల్లీలో ప్రస్తుతం గాలి నాణ్యత సూచీ 500 వరకు సూచిస్తోంది. గాలి నాణ్యత సూచీలో 400 దాటితే GRAP నాలుగో దశ కార్యాచరణ ప్రణాళికను అమలు చేసారు. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన గ్రేడెడ్ రెస్సాన్స్ యాక్షన్ ప్లాన్ నాలుగో దశ దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో అమలులో ఉంది.
ఈ నిర్ణయంతో నగరంలో పలు ఆంక్షలు అమలులోకి వచ్చాయి.
-ప్రత్యేక నిబంధనలు...
కాలుష్య పరిస్థితులు మరింతగా క్షీణించినందున, ఢిల్లీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోని 50% ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలనీ. అలాగే, 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. 12వ తరగతి వరకు ఆన్‌లైన్ పాఠాలు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగుతాయని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ సూచించింది.
ఢిల్లీలోకి నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా ఇతర ట్రక్కులుకు ప్రవేశాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఎల్ఎన్‌జీ, బీఎస్ – 4,సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ డీజిల్ ట్రక్కులు మాత్రమే అనుమతించనున్నారు. ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్‌తో ఉన్న తేలికపాటి కమర్షియల్ వాహనాలపై నిషేధం విధించారు. అయితే ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ బీఎస్ – 4 అంతకన్నా పాత డీజిల్ రవాణా వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు.
అలాగే అన్ని నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసారు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్‌లు, పైపులైన్‌లు..ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను నిలిపివేస్తూ ఆదేశించారు.
ఎన్ఆర్‌సీ ప్రాంతంలో కార్యాలయాలు అన్నీ 50 శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాలని, మిగతా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సిఫార్సు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని సూచించింది.